ప్రతి పల్లెను తాకిన బలగం.. ఆ ఊర్లో ఏం చేశారో తెలుసా?

by samatah |   ( Updated:2023-03-29 08:50:35.0  )
ప్రతి పల్లెను తాకిన బలగం.. ఆ ఊర్లో ఏం చేశారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మూవీ టీం కూడా ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంటుంది. కష్టం, సుఖం, బంధాలు, బంధుత్వాలు, కుటుంబం ఇలా ఎన్నో కలగలిసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తోబుట్టవుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నసీన్స్‌ను చూసి చాలా మంది బావోద్వేగానికి గురవుతున్నారు.

ఆస్తిపాస్తుల విషయాల్లో ఒక్క తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే కొట్టుకొని చస్తున్నారు.. కొంతమంది విదేశాలకు వెళ్లి కనీసం తల్లిదండ్రులను కడసారి చూసేందుకు కూడా రావడం లేదు. అలాంటి నేపథ్యంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని మరుస్తున్న మనకు దర్శకుడు వేణు గుర్తొచ్చేలా చేశాడు. దీంతో ప్రతి పల్లెటూరి వాల్లు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో,ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమాను నిజాంబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఆశ కొత్తూరు గ్రామ ప్రజలు అంతా కలిసి ఒక చౌరస్తా వద్ద గుమికూడి సినిమాను తిలకించారు.. ఈ విధంగా ప్రతి పల్లెను బలగం తాకింది. పల్లె పల్లెల్లో కూడలిల వద్ద పెద్దపెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని చూస్తున్నారంటే మామూలు విషయం కాదు.

ఇవి కూడా చదవండి: తగ్గేదేలే అంటున్న ‘బలగం’.. ఓటీటీలో వచ్చిన థియేటర్లలో తగ్గని కలెక్షన్లు

Advertisement

Next Story

Most Viewed