ఆ హీరోయిన్ తొందరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజక్షన్స్.. తల్లే ఇచ్చింది!!?

by sudharani |   ( Updated:2023-02-18 13:31:33.0  )
ఆ హీరోయిన్ తొందరగా ఎదిగేందుకు హార్మోన్ ఇంజక్షన్స్.. తల్లే ఇచ్చింది!!?
X

దిశ, సినిమా: బాలనటిగా కెరీర్ ప్రారంభించిన హ‌న్సిక‌ 'ఆప్ కా సురూర్' మూవీతో కథానాయికగా అరంగేట్రం చేసింది. అయితే చిన్న వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సికపై చాలా రకాల రూమర్స్ వినిపించాయి. హన్సిక తొందరగా ఎదిగేందుకు, ఆమె తల్లి హర్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా హన్సిక ఈ విషయంపై హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న తన 'లవ్ షాదీ డ్రామా' షోలో స్పందించింది. 'నేను ఎనిమిదేళ్లకే నటినయ్యా. త్వరగా ఎదగడానికి నా తల్లి నాకు హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చింది అని చాలా మంది చెత్తవాగుడు వాగారు. అదే కనుక నిజమైతే ఇప్పటికి నేను టాటా బిర్లా కంటే అస్తిపరురాలిని అయ్యేదాన్ని. అలా పిచ్చి పిచ్చి రాతలు రాయడానికి కాస్త అయిన బుద్ధి ఉండాలి' అంటూ చెప్పుకొచ్చింది.

Also Read...

సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్-కృతి డేటింగ్.. రేపు ఏం జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story