ఆరుగురిపై లైంగిక దాడి చేసిన డైరెక్టర్.. సపోర్ట్‌గా నిలిచిన నటి

by Hamsa |   ( Updated:2022-10-08 11:08:04.0  )
ఆరుగురిపై లైంగిక దాడి చేసిన డైరెక్టర్.. సపోర్ట్‌గా నిలిచిన నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ ఫిల్మ్‌మేకర్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా నిలిచింది. 'మీ టూ' ఉద్యమంలో భాగంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సాజిద్ 'బిగ్ బాస్ 16'లో ఎంట్రీ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా దీనిపై రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా స్పందించిన పాయల్.. 'ఆరుగురు మహిళలు సాజిద్ తప్పు చేశాడని బహిరంగంగా చెప్పారు. తన చర్యలతో అందరిచే మందలించబడ్డాడు. అవమానించబడ్డాడు. ఇప్పుడు ఆ మహిళలంతా అతన్ని కోర్టుకు తీసుకెళ్లవచ్చు. అయితే మీరు దాన్ని పక్కనపెట్టండి. మన దేశంలో మహాత్మా గాంధీ అందించిన సూత్రాలు, విలువల ద్వారా హంతకులకు కూడా కొన్ని సందర్భాల్లో క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సాజిద్ ఖాన్‌కు కూడా జీవించే హక్కు ఉంది. డబ్బు సంపాదించే రూల్స్ ఉన్నాయి. పశ్చాత్తాపపడే చాన్స్ ఉంది. తన హక్కు కోసం పోరాడనివ్వండి. మీరు అతనిని వ్యతిరేకించండి కానీ బాలీవుడ్‌ను విడిచిపెడతామని డ్రామాలు చేయకండి' అని సపోర్టుగా నిలిచింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

ఎట్టకేలకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన Samantha.. ?

Advertisement

Next Story