పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీలక షెడ్యూల్, షూటింగ్ అప్ డేట్

by samatah |   ( Updated:2023-08-05 09:55:55.0  )
పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీలక షెడ్యూల్, షూటింగ్ అప్ డేట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ AP ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రారంభిస్తానని అప్పట్లో చెప్పిన పవన్.. తాజాగా ఎన్నికలకు ముందే ఈ సినిమా కంప్లీట్ చేస్తానని, షూటింగ్ కోసం కేవలం 30 రోజుల పాటు డేట్స్ ఇస్తున్నట్లు దర్శకుడితో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి, 2024 ప్రారంభంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని కోకాపేట్‌లో వేసిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలు షూట్ చేయగా.. తదుపరి షెడ్యూల్ మంగళగిరిలో కొనసాగనున్నట్లు సమాచారం.

Read More: Samantha : రూ.25 కోట్ల అప్పుపై స్పందించిన సమంత

Advertisement

Next Story