పవన్ ప్రమాణ స్వీకారం.. చిరంజీవి ఆనందం.. వీడియో తీస్తున్న భార్య..

by Kavitha |
పవన్ ప్రమాణ స్వీకారం.. చిరంజీవి ఆనందం.. వీడియో తీస్తున్న భార్య..
X

దిశ, సినిమా: నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీ అంతా పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆనందంతో తిలకించారు. ఇక చిరంజీవి స్టేట్ గెస్ట్‌గా వేదిక పైనే కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు తమ్ముడిని చూస్తూ ఆనందంతో పులకరించిపోయాడు మెగాస్టార్. తమ్ముడు ప్రమాణ స్వీకారం చేసాక చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చిరంజీవిని గమనించిన వాళ్లు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇది అంటూ అభినందిస్తున్నారు.

ఇక పవన్ భార్య అన్నా లెజినోవా కింద వీక్షకులతో కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన ఫోన్‌లో వీడియో తీసుకుంది. ఇలా పవన్ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరగగా పవన్ అభిమానులు, కార్యకర్తలు, మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story