దర్శకుడు Surendar Reddy కి ఓకే చెప్పిన Pawan Kalyan..

by Shiva |   ( Updated:2023-09-01 14:48:03.0  )
దర్శకుడు Surendar Reddy కి ఓకే చెప్పిన Pawan Kalyan..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం రాజకీయల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే తనతో సినిమా తీసేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్నారు. తాజాగా, ఆ లిస్ట్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చేరాడు. తాజా సమాచారం ప్రకారం ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించి ఆఫీస్ ను శుక్రవారం ప్రారంభించారు. దీంతో పవన్ సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.

రామ్ తాళ్లూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా, వక్కంతం వంశీ కథను సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం వపర్ స్టార్ తన ఓజీ మూవీ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే సురేందర్ రెడ్డి మూవీ పట్టాలెక్కనుంది. ఏజెంట్ మూవీతో సురేందర్ రెడ్డి కాస్త డీలా పడినా.. పవన్ తనకు ఛాన్స్ ఇవ్వడంతో గాల్లో తేలుతున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సూరి పవన్ ను తన మూవీలో గ్రాండ్ గా చూపిస్తాడోనని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Sharukh Khan తో కలిసి స్టెప్పులేసిన Anirudh.. ఆ ఫర్మార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా

Advertisement

Next Story