హాట్ టాపిక్‌గా పవన్ భార్య అన్నా లెజినోవా ఆస్తుల వివరాలు.. వామ్మో అన్ని వందల కోట్లు ఉన్నాయా?

by Hamsa |   ( Updated:2024-06-14 09:59:59.0  )
హాట్ టాపిక్‌గా పవన్ భార్య అన్నా లెజినోవా ఆస్తుల వివరాలు.. వామ్మో అన్ని వందల కోట్లు ఉన్నాయా?
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె పవన్‌తో పెళ్లి కాకముందు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత అన్నా లెజినోవా ఇండస్ట్రీకి దూరం అయింది. ఆమె రష్యన్‌ అయినప్పటికీ పవన్ కల్యాణ్‌తో అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఒకానొక సమయంలో పవన్, అన్నా లెజినోవా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే ఆమె మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లట్లేదనే ప్రచారం జోరందుకుంది.

అయితే ఇటీవల పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో అన్నా లెజినోవా అతని వెంటే ఉండటంతో విడిపోయారనే పుకార్లకు చెక్ పడినట్లు అయింది. భర్తకు హారతి ఇచ్చి తిలకం కూడా దిద్దింది. అంతేకాకుండా పవన్ కోసం మెగా ఫ్యామిలీ నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో ఆయన చెప్పులు పట్టుకోవడంతో అందరి దృష్టి అన్నాపై పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అన్నా లెజినోవా ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమెకు రష్యా, సింగపూర్ ప్రాంతాల్లో ఏకంగా రూ. 1800 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో పెళ్లి కాకముందే బిజినెస్ చేసి సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. అన్నా లెజినోవా ఆస్తుల గురించి తెలిసిన వారంతా హీరోయిన్లు కూడా ఇంత సంపాదించి ఉండరు.. స్టార్స్ అందరినీ మించిపోయిందిగా అని అంటున్నారు.

Also Read: పవన్ భార్య అన్నా లెజీనోవా గురించి ఎవరికీ తెలియని నిజాలివే!

Advertisement

Next Story

Most Viewed