పవన్ కల్యాణ్ గెలుపు.. అలాంటి పని చేసిన త్రివిక్రమ్.. వావ్ ఇది కదా ఫ్రెండ్‌షిప్ అంటే!

by Hamsa |   ( Updated:2024-06-18 07:14:51.0  )
పవన్ కల్యాణ్ గెలుపు.. అలాంటి పని చేసిన త్రివిక్రమ్.. వావ్ ఇది కదా ఫ్రెండ్‌షిప్ అంటే!
X

దిశ, సినిమా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ గెలుపుతో ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ చేసిన వారంతా సంబురాలు చేసుకున్నారు. అలాగే మెగా మేనల్లుడు పవన్‌పై ఉన్న ప్రేమతో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్నారు.

అయితే త్రివిక్రమ్ ఫ్యామిలీని ఇప్పటివరకు ఎక్కువగా చూపించకపోవడంతో.. ప్రజెంట్ తిరుమల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మాటల మాంత్రికుడు కొడుకు లుక్స్ నెట్టింట అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అతని పేరు రిషి అని తెలుస్తోంది. మంచి హైట్ హీరో లుక్స్‌తో ఉండి.. కళ్ల జోడు పెట్టుకుని హీరోలా ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ కొడుకు లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే పవన్ గెలుచినందుకే త్రివిక్రమ్ కాలి నడకన శ్రీవారిని దర్శించుకోవడం గ్రేట్ ఫ్రెండ్‌షిప్ అంటే ఇదే కదా అని అంటున్నారు.

Advertisement

Next Story