Power Star Pawan Kalyan: న్యూ ఇయర్‌కు ముందురోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే!

by GSrikanth |   ( Updated:2023-01-21 14:43:28.0  )
Power Star Pawan Kalyan: న్యూ ఇయర్‌కు ముందురోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే!
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. ఆయన సినిమా విడుదల రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తలపించేలా సంబురాలు చేస్తుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విశేషమైన అభిమాన దళం ఆయన సొంతం. హిట్, ప్లాప్‌లో సంబంధం లేకుండా ఆయన సినిమా చూసేందుకు థియేటర్ల వద్దం జనం ఎగబడుతుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో 'ఖుషి' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. టీవీల్లో ఆ సినిమా వస్తుందంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే, తాజాగా.. మరోసారి 'ఖుషి' సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత ఏఎమ్ రత్నం భావించారు. డిసెంబర్ 31వ తేదీన విడుదల చేసి అభిమానులకు న్యూ ఇయర్‌కు ముందే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏఎమ్ రత్నం, దర్శకుడు ఎస్‌జే సూర్య సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేశారు. దీంతో మరోసారి తమకు ఇష్టమైన సినిమా అయిన ఖుషిని థియేటర్లలో చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామంటూ నెట్టింట్లో అభిమానులు సందడి చేస్తున్నారు.

READ MORE

#NBK108' నుంచి బిగ్ అప్‌డేట్.. సెట్‌లోకి శరత్ కుమార్

Advertisement

Next Story