- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan ఒక్క పోస్టుతో ఇన్‌స్టా షేక్.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయంటే?
దిశ, వెబ్‌డెస్క్: ‘నేను ట్రెండును ఫాలో అవ్వను.. ట్రెండును సెట్ చేస్తా’ అన్న పవర్ స్టార్ డైలాగ్ సినిమాలోనే కాకుండా.. నిజ జీవితంలో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిరూపించారు. ఇటీవలే(జులై 4న) పవన్ ఇన్‍స్టాగ్రామ్‍లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. పవన్ కల్యాణ్ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియిన్లలో ఫాలోవర్స్‌ను సాధించి కొత్త రికార్డు సృష్టించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే 2.4 మిలియన్ పైగా ఫాలో అవుతున్నారు.
అయితే ఆయన అభిమానులు మొదటి పోస్ట్ ఎప్పుడు పెడతారా అని వేయి కళ్లతో ఎదురుచూశారు. వారి కోరిక నెరవేరింది. జూలై 15న సాయంత్రం ఇన్‍స్టాగ్రామ్‍లో పవర్ స్టార్ మొదటి పోస్ట్ పెట్టారు.ఈ ఒక్క పోస్టుతో అందరిని మనసులను గెల్చుకున్నారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో తనతో పనిచేసిన వారందరితో దిగిన ఫొటోలను ఓ అందమైన వీడియోగా చేసి పోస్ట్ చేశారు. ఈ ఒక్క పోస్ట్‌తోనే ఇన్‌స్టా మొత్తం షేక్ చేశారనే చెప్పాలి. ఈ పోస్ట్ పెట్టిన 24 గంటల్లోనే 5.3 మిలియన్ వ్యూస్ సాధించి, 9.3 లక్షలు మంది లైక్స్ చేయగా, 71,953 కామెంట్స్ , 1,94,857 మంది ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఇది పవర్ స్టార్ రేంజ్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.