మళ్లీ రావా.. Pawan Kalyan హీరోయిన్‌ను మనసారా ఆహ్వానిస్తున్న Mega Fans

by Nagaya |   ( Updated:2023-08-23 15:41:28.0  )
మళ్లీ రావా.. Pawan Kalyan హీరోయిన్‌ను మనసారా ఆహ్వానిస్తున్న Mega Fans
X

దిశ, వెబ్‌డెస్క్ : పవన్ కళ్యాణ్ మేనరిజమే వేరు. యూత్‌కు ఐకాన్‌గా నిలిచే పవర్ స్టార్ మూవీస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగే. ఆయన నటించిన ప్రతి చిత్రంలో ఓ వైవిధ్యాన్ని పరిచయం చేస్తుంటారు. పవన్ సరసన నటించే హీరోయిన్లనూ అంతే మాదిరిగా గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. 1999లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం తమ్ముడు. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఇప్పటికీ ఆ చిత్రంలోని సాంగ్స్ హోమ్ థియేటర్లలో మార్మోగుతూనే ఉంటాయి. ఇక అందులో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన ప్రీతి జింగానియాని నేటికీ యూత్ మర్చిపోలేదంటే అతిశయోక్తి కాదు.

తమ్ముడు సినిమాతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రీతి జింగానియా.. ఆ తర్వాత బాలకృష్ణతో నరసింహనాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో యమదొంగలో నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 39 చిత్రాల్లో నటించిన ప్రీతి.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పటుడు పర్విన్ దబాస్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రీతి.. లేటెస్ట్‌గా తన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో తళుక్కున మెరిసింది. ఆమెను చూసిన మెగా ఫ్యాన్స్ వదినా ఇన్ని రోజులు ఎక్కడ పోయావ్.. మళ్లీ రావా.. నీ అందాల నవ్వులను పంచవా అంటూ కామెంట్స్ పెట్టున్నారు.

ఇవి కూడా చదవండి : స్టార్ హీరో ప్రేమలో Sree Leela తల్లి.. ఆయనతో Romance చేస్తే ఇంట్లోకి రావద్దంటూ కూతురికి Warning..!

Advertisement

Next Story