మరో క్రేజీ ప్రాజెక్టులో ఆఫర్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే రొమాన్స్

by Kavitha |
మరో క్రేజీ ప్రాజెక్టులో ఆఫర్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే రొమాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అటు ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri), కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) నిర్మించబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఈ భామ పాత్ర చాలా స్ట్రాంగ్ అని, ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story