నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. 'వారాహి'కి ప్రత్యేక పూజ

by sudharani |   ( Updated:2023-01-24 12:28:53.0  )
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజ
X

జనసేనాని పవన్ కల్యాణ్ ముచ్చటగా మూడోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. 2009 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన అంజన్న దర్శనానికి రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 2009 ఎన్నికల్లో యువరాజ్యం అధినేత హోదాలో ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. మంగళవారం మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వస్తున్న ఆయన ఎన్నికల ప్రచార రథం వారాహీకి ప్రత్యేక పూజలు చేయనున్నారు. డీఎస్పీ ప్రకాష్, సీఐ రమణమూర్తి, ఎస్ఐ మంద చిరంజీవి, ఆలయం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దిశ, కరీంనగర్ బ్యూరో: జనసేనాని పవన్ కల్యాణ్ ముచ్చటగా మూడోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. 2009 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన అంజన్న దర్శనానికి రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

నాడు అన్న కోసం

2009లో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 2009 ఎన్నికల్లో యువరాజ్యం అధినేత హోదాలో ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ ఇలవేల్పు అయిన పవన సుతుడు వెలిసిన కొండగట్టులో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా జరిపిన పవన్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఆర్పీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి పవన్ కొండగట్టులో పర్యటించారు. అప్పటికే కొత్త పార్టీని ప్రారంభించిన పవర్ స్టార్ జనసేన అధ్యక్షుడి హోదాలో రెండోసారి అంజన్నను దర్శించుకున్నారు.

ఆ రోజు కరీంనరగ్‌లో బస చేసిన ఆయన మహిళా విభాగాన్ని ఇక్కడే ప్రకటించడం విశేషం. మంగళవారం మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వస్తున్న ఆయన ఎన్నికల ప్రచార రథం వారాహీకి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కొండగట్టులో వాహన పూజ, అర్చనలు ముగిసిన తరువాత ధర్మపురికి చేరుకోనున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీలక్ష్మీనారసింహుడి సన్నిధిలో కూడా వారాహీకి పూజలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. అయితే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కొండగట్టు అంజన్న వద్దే ప్రత్యేక పూజలు చేసేందుకు ఆసక్తి చూపుతుండేది. ఈసారి మాత్రం ధర్మపురి నరసింహుడి సన్నిధికి కూడా వెల్తుండడం గమనార్హం.

భారీగా రానున్న అభిమానులు

జగిత్యాల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో తెలగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పవర్ స్టార్ అభిమానులు, జనసేన ముఖ్య నాయకులు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read...

RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Advertisement

Next Story