బాలయ్యతో Pawan Kalyan.. ఇక అభిమానుల్లో రచ్చరచ్చే

by sudharani |   ( Updated:2022-12-16 03:23:39.0  )
బాలయ్యతో Pawan Kalyan.. ఇక అభిమానుల్లో రచ్చరచ్చే
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ''అన్ స్టాపబుల్''. సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను పిలిచి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇలా మొదటి ఎపిసోడ్ నుంచే పెద్ద పెద్ద స్టార్‌లతో సందడి చేసిన బాలయ్య.. తాజా ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపిచంద్‌తో ఓ ఆటా ఆడుకున్నాడు. ఇదిలా ఉంటే.. అన్ స్టాపబుల్-2 కు సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది.

సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని గెస్ట్‌గా తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ షోకు వస్తున్నట్టు హింట్ ఇచ్చిన బాలయ్య.. ఏ ఎపిసోడ్‌లో వస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే సంక్రాంతి కానుకగా పవన్‌ను పిలుస్తున్నట్లు టాక్. ఏదిఏమైనా బాలయ్య, పవన్ కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ థ్రిల్ మొదలైపోయింది. ఇక ఏ ఎపిసోడ్‌కు వస్తారో వేచి చూడాల్సి ఉంది.

Also Read....

అవతార్‌-2 సినిమాకు పైరసీ దెబ్బ

Advertisement

Next Story