PAWAN KALYAN: రేణు దేశాయ్‌ను ఎత్తుకుని బైక్‌పై తీసుకెళ్తోన్న పవన్ కల్యాణ్.. చూడముచ్చటైన పిక్స్ వైరల్.. ఎగిరిగంతులేస్తున్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-08-08 10:48:23.0  )
PAWAN KALYAN: రేణు దేశాయ్‌ను ఎత్తుకుని బైక్‌పై తీసుకెళ్తోన్న పవన్ కల్యాణ్.. చూడముచ్చటైన పిక్స్ వైరల్.. ఎగిరిగంతులేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బద్రి, జానీ చిత్రాలతో ఒక్కటైన పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. తర్వాత కారణమేంటో తెలియదు కానీ పవన్-రేణు విడిపోయారు. ప్రస్తుతం పిల్లల బాధ్యతలను రేణు దేశాయ్ చూసుకుంటుంది. అటు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న మూడు చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించిన పవర్ స్టార్ తన వల్ల దర్శక, నిర్మాతలకు ఎటువంటి నష్టం వాటిల్లొద్దని షూటింగ్‌కు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇకపోతే హరహర వీరమల్లు చిత్రంలో రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ కు భార్యగా నటించడానికి అంగీకరించిందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఫ్యాన్స్ హరహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ ఇలా కనిపించబోతున్నారంటూ ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పిక్స్ చూడానికి ఎంతో చక్కగా ఉండటంతో ఆదర్శ దంపతులుగా కనిపిన్నారంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను ఎత్తుకున్న పిక్ నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా బైక్ పైన ఎక్కించుకుని వెళ్తున్నట్లు, రాణి, రాజు గెటప్‌లో ఇలా పలు ఫొటోలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు వీక్షించిన పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పిక్స్ చూసి మళ్లీ మీరు ఒక్కటైతే చూడాలని ఉంది, అకీరా, ఆద్య, పవన్ అన్న, రేణు దేశాయ్ వదిన ఫొటోలు ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story