- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇస్కాన్ టెంపుల్‌లో Pawan kalyan హీరోయిన్.. వైరలవుతోన్న పిక్స్

దిశ, వెబ్‌డెస్క్: ‘బావ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రణీత. తర్వాత ‘అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమకోసమే’ వంటి చిత్రాల్లో నటించి బొంగరాల్లాంటి కళ్లతో ప్రేక్షకులను ఇట్టే ఫిదా చేసింది. కాగా ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితం నితిన్ రాజ్ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. అయినప్పటికీ ప్రణీత తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించింది. ప్రణీతతో పాటు తన ముద్దుల కుమార్తెను కూడా వెంటతీసుకెళ్లింది. ఈ బ్యూటీ హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ, తన కూతురుని భుజంపై ఎత్తుకుని దేవుని ఎదుట కూర్చుని.. ట్రెడిషన్ లుక్‌లో మెరుస్తూ నెటిజన్లకు ఆకట్టుకునే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : మరీ అంత ఓవరాక్షన్ అవసరమా? Sitara ను తిట్టిపోస్తున్న నెటిజన్స్!