- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోతో Pawan Kalyan ను పోల్చిన ఆది.. ఏకిపారేస్తున్న పీకే ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షోలో బెస్ట్ కమేడియన్‌లో ఒకరు హైపర్ ఆది. ఈయన చేసే స్క్రిప్ట్‌లకు.. వేసే పంచులకు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆది పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన విషయం తెలిసిందే. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో ఆది నోరు జారడంతో పీకే ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆది వెళ్లాడు. ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. ''చిత్ర పరిశ్రమలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాట విన్నా, పాట విన్నా నోటికి తెలియకుండానే అరుపులు వస్తాయి.. విజిల్స్ వస్తాయి.. చేతికి చప్పట్లు వస్తాయి. నాకు తెలిసి మళ్లీ అంతటి స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ అబ్బవరం'' అంటూ చెప్పుకొచ్చాడు ఆది. ప్రస్తుతం ఆది మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ కామెంట్స్‌పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్‌తో పోల్చడం ఏంటీ అని ఆదిని ఏకిపారేస్తున్నారు.
Also Read : Pawan Kalyan చేతుల మీదుగా Kiran Abbavaram సినిమా ట్రైలర్ విడుదల