పవన్ కల్యాణ్‌‌కు పెద్దగా హిట్లు లేవు, నటన రాదు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

by Hamsa |   ( Updated:2023-04-28 04:39:16.0  )
పవన్ కల్యాణ్‌‌కు పెద్దగా హిట్లు లేవు, నటన రాదు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ అనేక చిత్రాల్లో నటించి స్టార్స్‌గా రాణిస్తున్నారు. అయితే మొదట చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ పాపులారిటీపై చిరంజీవి ఓ ఇంటర్య్వూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరు మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల పరంగా చాలా హైట్స్ చూశాను. నా చిత్రాలను చూసి అభిమానులు ఏర్పడ్డారు. కానీ, పవన్ కల్యాణ్‌కు పెద్దగా హిట్లు లేవు. నా లాగా డ్యాన్స్ కూడా రాదు. ఇంకా చెప్పాలంటే గొప్ప నటుడిగా కూడా అనిపించుకోలేదు. కానీ, అతనికి అంతగా ఫాలోయింగ్ రావడానికి కారణం అతని వ్యక్తిత్వమే. పవన్ వ్యక్తిత్వం కారణంగానే అంత మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందుకే అతను రాజకీయాల్లోకి వెళ్లినా సరే అంత మంది అతని వెంట నిలబడుతున్నారు. అతను అనుకున్న స్థాయిలో ఉంటాడనే నమ్మకం నాకు ఉంది’’ అంటూ చిరు చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్‌పై, చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Read more:

పవన్ కల్యాణ్‌ను అడ్డంగా బుక్ చేయనున్న రేణు దేశాయ్.. ‘కమింగ్ సూన్’ అంటూ సంచలన వీడియో

సపోర్ట్ ఉంటే సరిపోదు.. మనలో సత్తా ఉండాలి: ‘నేపో బేబీ’ ట్యాగ్‌పై అలియా

Advertisement

Next Story