- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ జీ.. గుడిలో ప్రసాదంతో పాటు ఇవి కూడా ఇవ్వండి.. ప్రముఖ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సుధీర్ బాబు(Sudheer Babu), అభిలాష్ రెడ్డి కంకర(Abhilash Reddy Kankara) కాంబోలో తెరకెక్కుతున్న ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’(Ma Nanna Superhero). ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు(Sunil Bulusu) నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు సరసన ఆర్నా(Aarna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. షాయాజీ షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుండి వచ్చిన ప్రతి అప్డేట్స్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్ల బిజీలో ఉంది.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సుధీర్ బాబు, ఆర్నా, షాయాజీలు బిగ్‌బాస్ సీజన్8(Bigg Boss Season8)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సుధీర్ బాబు మాట్లాడుతూ.. షాయాజీకు ఖాళీ ప్రదేశం కనపడితే చాలు చెట్లు నాటతారని హోస్ట్ నాగార్జునతో అన్నారు. దీంతో ఈ విషయం గురించి షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “మా అమ్మగారు 97 లో కన్ను మూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగా.. అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ, నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను అని బాధపడి, వెంటనే మరొక విషయం ఆమెకు చెప్పా. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని అన్నాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది.
సాధారణంగా ఆలయాలకు వెళ్లిన వాళ్లకు ప్రసాదాలు పంచి పెడతారు. ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు ఆలయాల్లో నేను ఈ విధానం ప్రారంభించాను. అయితే అందరికీ అలా మొక్కలు ఇవ్వరు. ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100 నుంచి 200 మందికి ప్రసాదంలాగా వాటిని ఇస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్‌మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్ని చెబుతా. దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలి. అవి నాటితే పెరిగి చెట్టు అవుతాయి. తర్వాత ఏడు జన్మలకు అవి పెరుగుతూనే ఉంటాయి” అని షాయాజీ షిండే అన్నారు. ఇక ఈ మాటలు విన్న నాగార్జున అతన్ని మెచ్చుకొని.. పవన్ కళ్యాణ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని, వారే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.
More New : అపాయింట్మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. మనసులోని మాట బయటపెట్టిన నటుడు షిండే