పవన్ ‘బ్రో’ టికెట్స్ రిలీజ్.. గంటలోనే అదిరిపోయే రెస్పాన్స్

by Hamsa |
పవన్ ‘బ్రో’ టికెట్స్ రిలీజ్.. గంటలోనే అదిరిపోయే రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తమిళ దర్శకుడు సముద్ర ఖని కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. ఇందులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 28న థియోటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా చిత్రబృందం నిర్వహించింది. విడుదలకు ఎక్కు సమయం లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ సినిమా టికెట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా, బ్రో టికెట్స్ ఓపెన్ చేశారు. దీంతో ప్రేక్షకులు గంటలోనే దాదాపు ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అయితే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్స్ రేట్ల పెంపు కూడా సెపరేట్ గా ఉండదని, పెద్ద సినిమాలకు ఉండే రేటు ఉంటుందని గతంలో నిర్మాతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టికెట్స్‌ బుకింగుకు వచ్చిన రెస్పాన్స్ చూసి అయినా చిత్ర యూనిట్ బెనిఫిట్, ప్రీమియర్ షోలు విడుదల చేస్తారేమో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed