- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను నమ్మి వచ్చిన పవిత్రను ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటా’: నరేష్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ నరేష్, పవిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే తాజాగా ‘‘మళ్లీ పెళ్లి’’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా వాళ్లు నరేష్‌ను.. ‘‘ పవిత్రకు మీకు పెళ్లైందా?’’ అని ప్రశ్నించగా.. దానికి నరేష్ బదులిస్తూ.. ‘ ఇది ఒక బోల్డ్ ఇండియా. మన పెళ్లిళ్ల వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా తీశాం. వ్యక్తుల మధ్య నమ్మకం లేకపోవడం, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి రీసన్స్‌తో వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది.
ప్రతీకారం కోసమే ఈ మూవీ తీశాను. ఎవరి ఇల్లు అయినా ప్రమాదంలో కూలిపోయినట్లయితే బాధపడుతూ అలాగే ఉండిపోతామా? లేక మళ్లీ ఇల్లు కట్టుకుంటామా? మా ఇద్దరి జీవితాలు కూడా కూలిపోయాయి. వాటిని మేం ఎవ్వరికీ చెప్పలేదు. మా మనసులు కలిశాయి. వివాహం చేసుకోవాలనుకుంటే అందరినీ ఇన్వైట్ చేసే చేసుకుంటాం. అలాగే నా ప్రాణం ఉన్నంత వరకు పవిత్రను హ్యాపీగా చూసుకుంటా. ఇద్దరికి ఇష్టమైతే మ్యారేజ్ చేసుకొవచ్చునని కోర్టు కూడా చెప్పింది కదా’’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read...
అన్ని విషయాల్లో నరేష్‌ను నమ్ముతానన్న పవిత్ర.. ఆప్షన్ లేదన్న ప్రియుడు