స్కూల్‌లో నటిపై లైంగిక దాడి.. టేబుల్‌పై పడుకోబెట్టి మరీ..

by sudharani |   ( Updated:2022-10-13 16:10:02.0  )
స్కూల్‌లో నటిపై లైంగిక దాడి.. టేబుల్‌పై పడుకోబెట్టి మరీ..
X

దిశ, సినిమా : అమెరికన్ మోడల్, నటి పారిస్ హిల్టన్ స్కూల్‌లోనే లైగింక వేధింపులకు గురైనట్లు తెలిపింది. అయితే ఈ నిజాన్ని ఇంతకాలం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టానన్న ఆమె.. ఇప్పుడు పాఠశాలలు సాధారణంగా ఆడపిల్లల గర్భాశయ పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయం గుర్తుచేస్తున్నట్లు తెలిపింది. 'ఓ సారి నేను చదువుతున్న బోర్డింగ్ స్కూల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. నాతోపాటు మరింతమంది అమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లారు. డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది మమ్మల్ని టేబుల్‌పై పడుకోబెట్టారు.

దీంతో భయంతో ఏడుస్తున్న నన్ను కాళ్లు తెరవమని అరిచారు. నోరు మూసుకో అంటూ బలవంతంగా వేళ్లను లోపలికి జొప్పించారు. అప్పుడేం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు నిజమైన డాక్టర్లు కాదని ఎంత అరిచినా ప్రయోజనం లేకపోయింది' అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను పెద్దయ్యాక బాల్యంలోనే సెక్సువల్ అబ్యూస్‌కు గురైనట్లు తెలుసుకున్నానన్న ఆమె.. మహిళలపై జరుగుతున్న దుర్మార్గాలను అంతం చేయడంలో తనవంతు సహాయపడగలనని చెప్పింది. ఇక స్కూల్లలో యుక్తవయస్సు పిల్లలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురికావడం భయానకంగా అనిపిస్తుందని పేర్కొంది.

టాలీవుడ్ హీరోయిన్‌తో హైపర్ ఆది ఎంగేజ్‌మెంట్.. ముహూర్తం ఇదే..?

60 ఏళ్ల ముసలాడితో ఎఫైర్ .. తట్టుకోలేక పోయానంటున్న హీరోయిన్


Advertisement

Next Story