పెళ్లై నెల కాకముందే భర్తతో కాకుండా మరొకరితో మాల్దీవ్స్‌కి వెళ్లిన పరిణీతి.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-17 04:49:18.0  )
పెళ్లై నెల కాకముందే భర్తతో కాకుండా మరొకరితో మాల్దీవ్స్‌కి వెళ్లిన పరిణీతి.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్ధాతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా, పరిణీతి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. భర్త లేకుండానే మాల్దీవులకు వెకేషన్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. దీనిని స్వయంగా పరిణీతి తెలుపుతూ ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ‘‘ నేను హీనమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫొటో నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్’’ అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లై నెల కూడా కాలేదు. నీ భర్తతో కాకుండా మరదలితో వెళ్లి ఎంజాయ్ చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు. అలాగే భర్త రాఘవ్ చద్దాతో వెళ్తే బాగుండేదని అంటున్నారు.

Advertisement

Next Story