పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్..

by Hamsa |   ( Updated:2023-05-09 13:01:15.0  )
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్..
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. దీనిని రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని సృష్టిస్తోంది. లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవ దత్తా నాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ పలు వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సీత లుక్ ను కూడా విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ విమర్శలే ఎక్కువగా ఎదుర్కొన్న మూవీ టీం.. ఈ సారి మంచి టాక్ రావడంతో కాస్త ఆనందంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా, ఆదిపురుష్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Also Read..

‘మహాభారతం’ ఏకంగా 10 పార్ట్‌లలో.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisement

Next Story