- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో ఆఫర్.. చచ్చినా చేయను అని రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. కారణం ఏంటో తెలిస్తే షాక్
దిశ, సినిమా: యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితమే. బుల్లితెరపై ఈమె యాంకరింగ్‌తో ఓ వెలుగు వెలిగిపోయింది. పటాస్ ప్రోగ్రామ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు షోల్లో చేయడమే కాకుండా ఈవెంట్స్‌లో కూడా తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ భామ గ్రాఫ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమెకి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. పాన్ ఇండియా ప్రభాస్ అంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతన్ని కలిసి మాట్లాడితే జన్మ ధన్యం అనుకుంటారు చాలామంది. మరి అలాంటిది ఏకంగా అతనితో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దనుకుంటారా..? కానీ యాంకర్ శ్రీముఖి మాత్రం నటించడానికి ససేమిరా అన్నదట. ఏంటీ ఆమెకు ఏమైనా పిచ్చి పట్టిందా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అని అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే.
ఎందుకంటే ఆమె ప్రభాస్ పక్కన సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి నో చెప్పింది. మరి డార్లింగ్ పక్కన చెల్లెలు క్యారెక్టర్ అంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి. ఇంతకీ ఆమె నో చెప్పిన సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ . ఎస్ ఈ సినిమాలో ప్రభాస్‌కి సిస్టర్ క్యారెక్టర్‌లో శ్రీముఖిని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ప్రభాస్ లాంటి డార్లింగ్ హీరోకి సిస్టర్ గానా చచ్చిన చేయను అంటూ సినిమా రిజెక్ట్ చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా సంచలనంగా మారింది. అంతేకాదు పలు సందర్భాలలో శ్రీముఖినే స్వయంగా ప్రభాస్‌కి పెద్ద ఫ్యాన్‌ననే విషయాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది.