బర్రెలక్కతో పెళ్లి.. మా మధ్య అలాంటి బంధం ఉందంటూ పల్లవి ప్రశాంత్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-02-02 03:07:59.0  )
బర్రెలక్కతో పెళ్లి.. మా మధ్య అలాంటి బంధం ఉందంటూ పల్లవి ప్రశాంత్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7కు ఎంట్రీ ఇచ్చి టాస్కుల్లో తనదైన సత్తా చాటాడు. అంతేకాకుండా విన్నర్‌గా నిలిచి భారీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా పల్లవి ప్రశాంత్ బర్రెలక్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల బర్రెలక్క అవన్నీ నిజం కాదని కొట్టిపారేసింది.

తాజాగా, పల్లవి ప్రశాంత్ స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘మీరు చెప్పే దాకా ఈ వార్త ప్రచారంలో ఉందనే విషయం కూడా నాకు తెలియదు. బర్రెలక్క శిరీష అంటే నాకు ఎంతో గౌరవం. నాలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి జనాలకు మంచి చెయ్యాలని అనుకుంటుంది. ఆమెని నేను నా చెల్లిగా భావించాను నా చెల్లికి జీవితంలో ఏం అవసరం వచ్చినా నేను తనకు సహాయంగా నిలుస్తాను. ఇలా మా మధ్య మీరందరూ క్రియేట్ చేసినటువంటి బంధం కాకుండా అన్నాచెల్లెల బంధం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story