అలియా భట్‌పై కన్నేసిన పాక్ నటుడు..

by sudharani |   ( Updated:2023-03-10 15:16:13.0  )
అలియా భట్‌పై కన్నేసిన పాక్ నటుడు..
X

దిశ, సినిమా : పాకిస్తానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ బాలీవుడ్ నటి అలియా భట్‌పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు భారతీయ సినిమాలను అమితంగా ఇష్టపడటానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్‌‌ను పాకిస్తాన్ సినిమాలో ఎందుకు పనిచేయడం లేదు? అక్కడి సినిమాల కంటే భారతీయ చిత్రాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ..

‘పాకిస్తానీ చిత్రాల్లో వైవిధ్యం కనిపించడంలేదు. స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో పాక్ రచయితలు మరింత మెరుగ్గా పనిచేయాలి. పాక్ ఇండస్ట్రీ నేను కోరుకునే స్థాయి కథలను అందించలేదని నమ్ముతున్నా. అందుకే భారతీయ సినిమాలు ఎంచుకుంటున్నా. అలాగే ఆ కాలంలో మాధురీ దీక్షిత్, రాణి ముఖర్జీని బాలీవుడ్ దివాస్‌గా పరిగణించేవారు. నేను ఇప్పుడు అలియాను సమకాలీనురాలిగా భావిస్తా. ఆమె గొప్ప నటి’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.

Also Read..

సర్జరీతో పూర్తిగా మారిపోయిన హీరోయిన్ ఫేస్.. ఆమెనే భయపడిపోయింది.

Advertisement

Next Story