- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT Horror Film : అక్కడ ప్రతీ పురుషుడు రాత్రిపూట ఆ పని చేయలేదో!.. 13వ రోజు మరణమే!!
దిశ, సినిమా : ‘‘అదేంటో గానీ కొందరు సినీ లవర్స్ మెంటాలిటీనే డిఫరెంట్ అబ్బా.. వాళ్లకి ఏది నచ్చుతుందో, దేన్ని ఆదరిస్తారో ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు’’ అంటుంటారు కొందరు. ఈ మధ్య వస్తు్న్న మూవీస్, ఓటీటీ రిలీజ్‌ల విషయంలోనూ అదే టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు గతంలో విడుదలైన సూపర్ హిట్ అయిన, యానిమల్ మూవీలో బోల్డ్ అండ్ అన్ వాంటెడ్ కంటెంట్ ఉందని కొందరు విమర్శించగా.. మెజారిటీ సినీ ప్రేక్షకులు మాత్రం దానినే ఆదరించారు. అట్లనే ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ప్రభావస్ ‘కల్కి’ మూవీ గురించి కొందరు ‘గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప ఓ స్టోరీ లేదు.. పాటా లేదు.. కామెడీ ఏదీలేదు’ అంటూ విమర్శిస్తున్నప్పటికీ అత్యధిక మంది సినీ లవర్స్‌లో ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తోంది.
ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో విడుదలయ్యే హారర్, థ్రిల్లర్, మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కంటెంట్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అది మూఢ నమ్మకమా, వాస్తవమా, భావోద్వేగమా అనే దానితో సంబంధం లేకుండా ‘ఓ టైప్ ఆఫ్ ఎమోషనల్’గా యువతను ఆకట్టుకుంటున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వాటిలో హారర్ అండ్ కామెడీ మిక్స్‌డ్ జానర్‌లో వచ్చిన ‘కాకుడ’ కూడా ఒకటి.
గతంలో స్త్రీ, భేడియా, మంజ్యా.. వంటి హారర్ కామెడీ సినిమాలు ఓటీటీ వేదికపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం జులై 12న, ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైన ‘కాకుడ’ కూడా అదే లెవల్లో దూసుకుపోతోంది. ఓ బాధాకర ఘటనలో చనిపోయిన వ్యక్తి ఆ తర్వాత ఆత్మగా మారి గ్రామ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే భయానక సన్నివేశాలు, మధ్య మధ్యలో కాస్త కామెడీలతో కొనసాగే ‘కాకుడ’ ఎందుకోగానీ సినీ లవర్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. కాగా ఇందులో సాకిబ్ సలీమ్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ముత్రలోని ఓ చిన్న గ్రామమైన రథోడిని ‘కాకుడ’లో ఓ శాపగ్రస్తమైన ఊరిగా ప్రత్యేకంగా చూపించారు.
కథలోకి వెళ్తే.. అక్కడ ప్రతీ ఇంటికి రెండు తలుపులు ఉంటాయి. ఇందులో ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా ఉంటాయి. కాగా గ్రామస్తుల స్వీయ తీర్మానం ప్రకారం.. ప్రతీ మంగళవారం సరిగ్గా రాత్రి 7:15 నిమిషాలకు ప్రతీ ఇంటిలోని ఓ పురుషుడు తమ ఇంటి గదుల్లో చిన్న తలుపు గల గదిని తెరవాలి. అలా చేయకపోతే గనుక ‘కాకుడ’ అనే ఆత్మ ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇంటిలో గల పురుషుల్లో ఒకరిని ఆవహిస్తుంది. 13వ రోజున చంపేస్తుంది. ప్రతీ క్షణం ఉత్కంఠత రేపే ఈ మూవీ ప్రజెంట్ టాప్ ట్రేడింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అయితే ఆత్మ ఆ ఊరిలోని పురుషులనే ఎందుకు చంపేస్తుంది? దీని వెనుక గల కారణాలు ఏంటనే విషయాలపై ఫుల్లు క్లారిటీ రావాలంటే మాతరం మూవీ చూడాల్సిందే!