బిగ్ బ్రేకింగ్.. భారత్‌కు ఆస్కార్ అవార్డ్

by Mahesh |   ( Updated:2023-03-13 02:35:58.0  )
బిగ్ బ్రేకింగ్.. భారత్‌కు ఆస్కార్ అవార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలిమ్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీన్ని కార్తిక్ గోన్సాల్వేస్, గునీత్ మొంగా రూపొందించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ ఏడాది మొత్తం మూడు కేటగిరీల్లో మన భారత సినిమాలు నామినేషన్స్ పొందాయి.

‘RRR’ ‘నాటు నాటు…’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకోగా, ‘ఆల్ దట్ బ్రీత్స్’ మూవీ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఉన్నాయి. అయితే ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’కు ఆస్కార్‌ దక్కలేదు. ఈ నిరాశను పటాపంచలు చేస్తూ… బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన భారతీయ చిత్రం "ది ఎలిఫెంట్ విస్పరర్స్" "ఆస్కార్" దక్కించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో మేకర్స్ కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్‌ మోంగా అవార్డ్ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుస్తుందా.. రూ. కోట్లలో బెట్టింగ్! టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా..

Advertisement

Next Story