- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' సంస్కారవంతమైన చిత్రం: రాజేంద్ర ప్రసాద్
దిశ, సినిమా : ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'. కె.అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మించిన సినిమాలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించగా.. సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మూవీ మార్చిలో విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాలో పలు విశేషాలను పంచుకుంది చిత్ర బృందం.
'46 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమా ఇది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు రాజేంద్రప్రసాద్. అలాగే ఎంటర్‌టైన్మెంట్‌కు, డైలాగ్స్‌కు మంచి స్కోప్ ఉన్న కథ తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నాడు డైరెక్టర్. చివరగా మీనా, సోహైల్, హేమ, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ చిత్రం జనాలకు కనువిందు చేస్తూ బ్లాక్‌బస్టర్ అవుతుందన్నారు.