- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Operation Raavan: మారువేషం.. మాస్క్.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఆపరేషన్ రావణ్’
దిశ, సినిమా: దర్శకుడు వెంకట సత్య తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఆపరేషన్ రావణ్’. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ నటీనటులుగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఆపరేషన్ రావణ్’ సినిమా ఈ నెల 26వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు వెంకట సత్య.
‘సాధారణంగా సినిమాల్లో మన విలన్స్ భూ ఆక్రమణలు, డ్రగ్స్ అమ్మకం వంటి తప్పుడు పనులు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇవన్నీ ఆ విలన్స్ యాక్టివిటీస్. కానీ మేము ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్‌గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసిన ఒప్పు చేసినా దానికి ఆ ఆలోచనే కారణం. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా రూపొందించాను. మన ఇతిహాసాల్లో రామాయణం ఒక థ్రిల్లర్. శ్రీరాముడు తనకు పట్టాభిషేకం జరుగుతుంది అనగా అడవులకు వెళ్లాల్సివస్తుంది. అక్కడి నుంచి రావణుడు సీతను అపహరిస్తాడు. ఎవరు అపహరించారో తెలియదు. ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు వెళ్తాడు. ఇలా రామాయణం థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. “ఆపరేషన్ రావణ్” లోనూ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు మా మూవీలో మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అందుకే టైటిల్‌కు “ఆపరేషన్ రావణ్” అని పెట్టాం’ అని చెప్పుకొచ్చారు.