ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి.. కట్ చేస్తే 5 నిమిషాలకు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్

by Kavitha |
ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి.. కట్ చేస్తే 5 నిమిషాలకు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: బేసిక్‌గా మూవీ యాక్టర్స్ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా చాలా ఆడంబరంగా ఉంటుందని మనమందరం అనుకుంటాము. కానీ వాళ్లు ఆ పొజిషన్‌కు రావడానికి ఎన్ని కష్టాలు పడి వచ్చారో మాత్రం మనకు తెలియదు. మ్యాగ్జిమమ్ చాలా మంది యాక్టర్స్ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ఎన్నో ఆఫీస్‌ల చూట్టూ తిరిగి తిరిగి అసలి పోయి లాస్ట్‌కు అవకాశాలను అందుకున్న వారే ఉంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా దొరకలేదట. కానీ ప్రస్తుతం తన గ్రాఫ్ మారిపోయింది. ఒక మూవీలో కేవలం 5 నిమిషాలు కనిపించడానికి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? మరేవరో కాదు తన అంద చందాలతో, డాన్స్‌తో ఆకట్టుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.

ఈమె విదేశీ యువతి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రూ.5,000 తో ఇండియాకు వచ్చేసింది. అలా వచ్చి అప్పట్లో ఆమెతో సహా తొమ్మిది మందితో ఓ రూమ్ షేర్ చేసుకుని, తినడానికి సరైన తిండి కూడా లేక ఎన్నో అష్ట కష్టాలు పడింది. కానీ చివరికి ఎలాగోలా ఇండస్ట్రీలో నటించే అవకాశం దక్కించుకుంది నోరా.

అలా చిన్న చిన్న అవకాశాల నుంచి ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే బాహుబలి‌లో మనోహరి సాంగ్‌తో ఫుల్ పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తూ కోట్లల్లో సంపాదిస్తుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో కేవలం 5 నిమిషాలు నటించినా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్‌లోనే స్పెషల్ సాంగ్స్‌కు నోరా పెట్టింది పేరు. అలాగే తెలుగులోనూ చాలా సాంగ్స్ లో మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.




Next Story

Most Viewed