నా కెరీర్‌లోనే నాకు గుర్తుండి పోయే క్యారెక్టర్ అది: Samantha

by sudharani |   ( Updated:2023-04-10 07:42:48.0  )
నా కెరీర్‌లోనే నాకు గుర్తుండి పోయే క్యారెక్టర్ అది: Samantha
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికి తెలిసిందే. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తాజాగా.. సమంత నటించిన సినిమా ‘శాకుంతలం’ ఏప్రిల్-14 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సామ్.. తను నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పాత్ర గురించి తెలిపింది.

సమంత మాట్లాడుతూ.. ‘‘నాకు పుస్తకాలు చదవటం అలవాటు. అందులోను ‘ద సీక్రెట్’ అనే బుక్ అంటే చాలా ఇష్టం. అది చదివాకే నాలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకున్న’’ అని తెలిపారు. తను చేసిన సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన అన్ని సినిమాల్లోని పాత్రలు నాకు ఇష్టమే. కానీ అన్నింటి కంటే ‘ఓ బేబి’ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన పాత్ర. నా కెరీర్‌లోనే నాకు బాగా నచ్చిన పాత్ర అది. ఆ సినిమా చేసినప్పుడు చాలా కంగారు పడ్డా.. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా చేశానంటూ ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతృప్తి చెందాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more: చిరంజీవి నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా?

‘ఆ ఒక్క మాట అని ఉంటే.. పవన్ కళ్యాణ్‌కు జైలు శిక్ష పడేది’ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed