అక్టోబర్-11: నేడు బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ పుట్టిన రోజు

by Hamsa |   ( Updated:2023-10-11 04:00:20.0  )
అక్టోబర్-11: నేడు బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు (జ.1942 అక్టోబర్ 11). ఆయన 1969లో ‘భువన్ షోమ్’ అనే సినిమాతో మొదటి సారి పరిచయం అయ్యారు. మృణిల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. నటుడిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏడుగురు ప్రధాన పాత్రల్లో ఒకరిగా అమితాబ్ చేశారు. అంతేకాకుండా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఫుల్ పాపులారిటీ ఉంది. ఆయన సినిమాలే కాకుండా పలు రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. 1984లో, అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీ కి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్.ఎన్.బహుగుణ కు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి లోక్ సభకు పోటీ నిలబడ్డారు ఆయన. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 68.2శాతం ఆధిక్యంతో అమితాబ్ గెలిచారు . కానీ ఆయన మూడేళ్ళకే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో గెస్ట్ రోల్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed