మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఏమన్నారంటే?

by Hamsa |   ( Updated:2024-09-08 12:05:42.0  )
మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఆయన మొదటి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ సినిమా డైరెక్టర్‌తో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కూతురు తేజస్విని ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై, చేరుకూరి సుధాకర్‌తో కలిసి నిర్మిస్తోంది. అయితే ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ వర్మ ఆయన నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. దీంతో నందమూరి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మోక్షుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

తాజాగా, మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పోస్టులు పెట్టారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షు. నువ్వు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారి ఆశీర్వాదాలతో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. అలాగే కల్యాణ్ రామ్ ‘‘టిన్సెల్ టౌన్‌కు మోక్షుకు స్వాగతం.తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నాడు. ప్రజెంట్ ఈ ఇద్దరి పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story