‘దేవర’ అంటే దేవుడు.. సినిమాపై హైప్ పెంచేస్తున్న ఎన్టీఆర్

by sudharani |
‘దేవర’ అంటే దేవుడు.. సినిమాపై హైప్ పెంచేస్తున్న ఎన్టీఆర్
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచుతూ.. వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్.. సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘దేవర’ రిలీజ్ దగ్గరపడటంతో టెన్షన్‌గా ఉంది. అయితే.. ఈ సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. టీమ్ అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడింది. దేవర అంటే దేవుడు అనే అర్థం. అందుకే అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాము. కరణ్ జోహార్ సూచనలతో జాన్వీ కపూర్‌ను ఈ సినిమాలో తీసుకున్నాము. ఆమె యాక్టింగ్‌తో మమ్మల్ని షాక్‌కు గురి చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఎన్టీఆర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed