Rana Naidu: ఒకప్పుడు చెత్తగా ఉందన్నారు.. ఇప్పుడు ఆ సిరీస్ కె ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న స్టార్ హీరో

by Prasanna |
Rana Naidu: ఒకప్పుడు చెత్తగా ఉందన్నారు.. ఇప్పుడు ఆ సిరీస్ కె ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న స్టార్ హీరో
X

దిశ,సినిమా : రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ ప్రసంశలు కంటే విమర్శలే ఎక్కువ ఎదుర్కొంది. యూత్ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ సిరీస్ పైన మండిపడ్డారు. అయితే, అప్పుడు వెంటనే కొన్ని సీన్స్ తొలగించి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసారు. అలా ఘాటు విమర్శలు ఎదుర్కొన్న ఈ సిరీస్ కి తాజాగా మంచి గుర్తింపు వచ్చింది. అదేంటో ఇక్కడ చూద్దాం ..

హీరో రానా, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ కి గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును అందుకుని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడు. 2024 ఇండియన్‌ టెలీ అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ తారలు సందడి చేసారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు.

ఇతర కారణాల వల్ల రానా వెళ్ళకపోవడంతో.. ఈ సిరీస్ కు దర్శకత్వం వహించిన క‌ర‌న్ హ‌న్షుమాన్ ఈ అవార్డును అందుకున్నారు. ఇండియన్‌ టెలీ అవార్డ్ 2024 లో " నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా ఉంది’’ అంటూ ట్విట్టర్ ద్వారా రానా ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed