‘అల్లం బెల్లం అనసూయ నా పెళ్ళాం’.. మళ్లీ మొదలైన ట్రోల్స్

by sudharani |   ( Updated:2023-07-19 12:32:10.0  )
‘అల్లం బెల్లం అనసూయ నా పెళ్ళాం’.. మళ్లీ మొదలైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టి.. ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అనసూయ. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అమ్మడు చెంతకు చేరాయి. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. నెట్టింట బోల్డ్ షో చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఈ భామపై మరోసారి ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్లు.

ఓవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటున్న అనసూయ.. తన పర్శనల్ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ మేరకు విదేశాల్లో వెకేషన్ ట్రిప్‌లో ఉన్న ఈ అమ్మడు.. వాషింగ్టన్‌ సిటీలో ఫుల్ డ్రెస్‌తో దర్శనమిచ్చింది. అయితే.. అనసూయ బట్టలు పద్ధతిగానే ఉన్నప్పటికి నెటిజన్లు మాత్రం వల్గర్ కామెంట్స్ పెట్టడం మానడం లేదు. ఈ మేరకు అనసూయ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ‘‘అల్లం బెల్లం అనసూయ నా పెళ్ళాం అంటే వాళ్ల ఆయన ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా’’ అని ఎవరికి నచ్చినట్టు వాళ్లు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story