నా ఫ్రెండే నన్ను మోసం చేసింది.. నా ప్రియుడితో తిరుగుతుంది.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

by Sujitha Rachapalli |
నా ఫ్రెండే నన్ను మోసం చేసింది.. నా ప్రియుడితో తిరుగుతుంది..  హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ ప్రేమించి మోసపోయానని చెప్తుంది. తొందరపడి లవ్ లో పడొద్దని నేటి యూత్ కు సలహా ఇస్తుంది. నిజానికి తను చీట్ చేయబడుతున్నానని కలలో వచ్చిందని... ముఖ్యంగా తన ఫ్రెండ్ తన లవర్ ను సెట్ చేసుకుంటుందని.. జాగ్రత్తగా ఉండాలని డ్రీమ్ చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది. కానీ నిజంగానే అది జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని నెలలు చాలా డిస్టర్బ్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో బాధపడింది.

ఇక తనకు ఒక్కోసారి సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది అంటుంది నివేద. ఎందుకంటే తను ఎప్పుడు, ఏ కారు కొంటానో కూడా కలలో వచ్చినట్లే.. నిజ జీవితంలోనూ జరిగిందని చెప్పింది. ఇదంతా చూసి ఇలాంటి డ్రీమ్స్ రాకూడదని కోరుకుంటున్నాను అంటుంది.

Advertisement

Next Story