Nikhil on Karthikeya 3: : త్వరలోనే కార్తికేయ-3.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్

by sudharani |   ( Updated:2023-08-14 13:16:55.0  )
Nikhil on Karthikeya 3: : త్వరలోనే కార్తికేయ-3.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ-2’ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది వచ్చిన ఈ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఎండింగ్‌లో పార్ట్-3 కూడా ఉన్నట్లు తెలిపారు. దీంతో పార్ట్-3 ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే.. ‘కార్తికేయ-2’ చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న క్రమంలో నిఖిల్ ఓ ట్వీట్ షేర్ చేశాడు. ఈ మేరకు ‘‘1 సంవత్సరం క్రితం ఇదే రోజున ‘కార్తికేయ2’ రిలీజ్ అయింది. ఇంత భారీ విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు టీమ్ & మీడియాతో వేడుకలు.. అంతే కాదు అతి త్వరలో మేము తదుపరి భాగంతో తిరిగి వస్తాము’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘పార్ట్ 3 గురించి అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారు.. వెయిట్ చేస్తున్నాం’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story