- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి తర్వాత ఆ విషయం తెలిసి విడాకులు తీసుకున్నా.. నిహారిక షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 2020 డిసెంబర్ 9న ఉదయ్ పూర్ విలాస్‌లో చైతన్య జొన్నలగడ్డతో ఉదయ్ పూర్ విలాస్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. వీరి కాపురం కొద్ది కాలం పాటు బాగానే సాగినప్పటికీ ఏవో మనస్పర్థలు రావడంతో ఇటీవల ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయాన్ని మెగా డాటర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. తన పని తాను చూసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసిన పట్టించుకోకుండా నాకు నచ్చినట్టు ఉంటానని నెటిజన్లకు కౌంటర్ వేస్తుంది.
ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే వెకేషన్స్‌కు వెళ్తూ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తుంది. నిహారిక ఏమ్ షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల ఓ నిర్మాణ సంస్థ పెట్టి పలు వెబ్‌సిరీస్‌లు సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక విడాకులపై స్పందించింది. ‘‘ విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లుగా నేను అనుకోలేదు. ఎదుటి వారిని ఈజీగా నమ్మకూడదని పెళ్లి తర్వాత అర్థం చేసుకున్నాను.
అదొక అనుభవపాఠంగా భావించి ముందుకు సాగడం అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లు వస్తుంటాయి. పెళ్లి అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టమని, కలకాలం కలిసి ఉంటామనే ఏ జంటైనా వివాహం చేసుకుంటారు. అంతేకానీ ఏడాదిలో విడిపోతామని అనుకొని భారీగా ఖర్చు పెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరు. ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ రిలేషన్‌షిప్ సాఫీగా సాగాలనే అనుకుంటారు.
అలా ఆలోచించే ప్రేమ, పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. నేను అలాగే అనుకున్నాను. కానీ నేను ఊహించిన్నట్లు జరగలేదు. అందుకే ఆ బంధాన్ని ముగించాల్సి వచ్చింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నదే నాకు ముఖ్యం. అంతే కానీ నాకు తెలియని వారు.. నాతో సంబంధం లేని వారు ఏమనుకున్నా పట్టించుకోను. గత రెండేళ్లలో ఫ్యామిలీ విలువను చాలా అర్థం చేసుకున్నా. నన్ను నా ఫ్యామిలీ ఎప్పుడూ భారంగా అనుకోలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.