- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌ను ఆయనతో పోల్చిన నిహారిక.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. ఇటీవల ఈ అమ్మడు తన భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో పాటుగా.. నిర్మాతగా మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ప్రజెంట్ నిహారిక తన సొంత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో కమిటీ కుర్రాళ్లు సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ మూవీకి యాదు వంశీ దర్శకత్వం వహించాడు.
అయితే ఇందులోంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే కమిటీ కుర్రాళ్లు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో.. నిహారిక ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా.. నిహారిక ఓ షోలో పాల్గొంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగా డాటర్ భాగమైంది.
ఇందులో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, చేసిన తర్వాత మెగా ఫ్యామిలీ లో జరిగిన సెలబ్రేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత మా బాబాయ్ ఇంటికి వచ్చిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. అది చూసిన తర్వాత యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలాగే ఉండేదేమో అని అనిపించింది. ఆయన గెలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.