- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దింటిదాన్నైనా ఆ పని చేస్తా.. ఆయన పిలిస్తే తప్పకుండా వెళ్తాను.. నిహారిక సంచలన కామెంట్స్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఈ మధ్యన ఫుడ్ కు ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తున్నాను. పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. నేను సంపాదించే దాంట్లో కొంత డబ్బు సేవ్ చేసి వెకేషన్స్ కు వెళ్తున్నాను. అటు వెళ్లాలి, ఇటు వెళ్లాలని ముందుగా ఏది ప్లాన్ చేయను. ఆ సమయంలో ఏం అనిపిస్తే అదే చేసేస్తాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.
ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు బాగా నచ్చాయి. నాకు కమర్షియల్ రోల్స్ చేసే అవకాశం రాలేదు. డైరెక్టర్ కమర్షియల్ పాత్రలకు అడగలేదు. అడిగితే నేను తప్పకుండా చేసేదాన్ని. అలాగే నేను పెద్దింటి అమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడమేంటని నేను ఎప్పుడు అనుకోను. నిజం చెప్పాలంటే ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా ఇష్టపడతాను. ఓ మంచి సినిమాకు దర్శకులు ఆడిషన్‌కు పిలిస్తే తప్పక వెళ్తాను’’. అంటూ నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుని గత ఏడాది హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు. నిహారిక ప్రస్తుతం నిర్మాతగా చేస్తుంది. అలాగే ఓ తమిళ సినిమాకు సైన్ చేసిందట. మంచు మనోజ్ కమ్ బ్యాక్ సినిమా వాట్ ది ఫిష్ లో కూడా మెగా డాటర్ ముఖ్యపాత్రలో నటించనుందని టాక్.