శంషాబాద్‌లో 11 ఎకరాల స్థలం.. క్లారిటీ ఇచ్చిన Renu Desai

by Hamsa |   ( Updated:2023-11-06 07:35:07.0  )
శంషాబాద్‌లో 11 ఎకరాల స్థలం.. క్లారిటీ ఇచ్చిన Renu Desai
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వేరే పెళ్లి చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. కొద్ది కాలంగా సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే పిల్లలతో ఉంది. ఇటీవల రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అవుతూ ఉంటుంది. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తాజాగా, రేణు దేశాయ్ తాను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలిపింది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.మామూలుగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. వారిని చూసుకోవాల్సిన పని లేదు.ఇక మీరు సినిమాలు కూడా చేయడం లేదు. మరి మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? అని యాంకర్ అడగ్గా.. దానికి రేణు దేశాయ్.. ‘‘నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉన్నాను. మా నాన్న కూడా ల్యాండ్ డెవలపర్. హైదరాబాద్‌లో నాకు ఎక్కడా 11 ఎకరాల స్థలం లేదు. శంషాబాద్‌లో ఉందని అని వార్తలు రాస్తున్నారు. కానీ అది అబద్ధం నేను ఓపెన్ ల్యాండ్స్ కొనను.

అపార్ట్‌మెంట్స్ మాత్రమే కొంటాను. జయభేరీ అపార్ట్‌మెంట్స్ నాకు ఒక అపార్ట్‌మెంట్ ఉంది. నేను నా ప్రాపర్టీస్ గురించి ఎవరికీ చెప్పను. కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో, లేదంటే కట్టడం పూర్తయ్యాక ఏదైనా ఇల్లు కొంటాను. కొంచెం ప్రాఫిట్ వస్తుంటే అమ్మేస్తాను.సినిమాలు చేయకపోయినా నాకు ఎలా డబ్బులు వస్తాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు.వారందరికీ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, దాన్నుంచి సంపాదిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే యాంకర్ మీ సంపాదన మొత్తం ఎంత వస్తుందని అడగ్గా.. దానికి ఆమె అవి ఎవరికీ చెప్పను అని ఖరాఖండిగా చెప్పేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story