శ్రీలీల న్యూ యాడ్.. కుర్చీ మడతపెడుతం జాగ్రత్త.. అంటున్న నెటిజన్లు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-06-06 12:10:48.0  )
శ్రీలీల న్యూ యాడ్.. కుర్చీ మడతపెడుతం జాగ్రత్త.. అంటున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ శ్రీలీల అందం, డ్యాన్స్ కు కుర్రాళ్లు ఇప్పటికే ఫిదా అయిపోయారు. కానీ వాళ్లు అనుకున్నంత రేంజ్ లో నటించక పోవడం, సక్సెస్ అందుకోక వెనుకబడటం చూసి ఫీల్ అయిపోతున్నారు. వరుస డిజాస్టర్స్ ఎదుర్కోవడాన్ని తట్టుకోలేక పోతున్నారు అభిమానులు. అయితే సినిమాల విషయం ఎలా ఉన్నా.. యాడ్స్ మాత్రం ఓ రేంజ్ లో చేస్తుంది ఈ యంగ్ బ్యూటీ. ఈ క్రమంలోనే ఓ కాలేజ్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ చేసింది. దీంతో మీమర్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. జనాలు కుర్చీ మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నారు.

ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డాక్టర్ కావాలనే కల.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. అంటూ సాగే ఈ కాలేజ్ యాడ్ పై నెటిజన్లు ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. అందులో చదువుతున్న స్టూడెంట్స్ ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎలా ప్రమోట్ చేస్తావని ప్రశ్నిస్తున్నారు. తెలుగు అమ్మాయిగా పరువు నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు. జనాలకు చెడు చేసే యాడ్స్ భవిష్యత్తులో కూడా చేయకూడదని కోరుతున్నారు. మరి ఈ అమ్మడు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed