Samantha - Vijay Devarakonda ‘ఖుషి’.. ఆ సినిమాకు కాపీ అంటూ దారుణమైన ట్రోల్స్

by Hamsa |   ( Updated:2023-08-13 08:06:28.0  )
Samantha - Vijay Devarakonda ‘ఖుషి’.. ఆ సినిమాకు కాపీ అంటూ దారుణమైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. దీనిని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఈ సినిమా నెట్టింట భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అచ్చం మణిరత్నం సినిమాలా ఉన్నాయంటున్నారు. హీరో మాధవన్ నటించిన ‘సఖి’ చిత్రానికి కాపీ చేసి ఖుషిని మళ్లీ తీశారని అంటున్నారు. అంతేకాకుండా ఖుషి, సఖి సినిమాల్లోని ఒకే రకంగా ఉన్న సీన్స్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ ఈ సారి కూడా హిట్ అందుకుంటుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Read More: ఆ ఇంజెక్షన్ నా జీవితాన్ని నాశనం చేసింది: బ్రిట్నీ స్పియర్స్

Advertisement

Next Story