Sreemukhi : యాపిల్ పండులా ఉన్నావు.. నువ్వే నా క్రష్.. శ్రీముఖిపై ఆగని ట్రోల్స్

by Javid Pasha |   ( Updated:2024-04-16 12:40:23.0  )
Sreemukhi : యాపిల్ పండులా ఉన్నావు.. నువ్వే నా క్రష్.. శ్రీముఖిపై ఆగని ట్రోల్స్
X

దిశ, సినిమా : స్మాల్ స్ర్కీన్ ముద్దుగుమ్మ, ఫేమస్ యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితమే. ఓ వైపు టెలివిజన్ షోలు, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా వేదికగానూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కెరీర్‌, యాక్టింగ్, యాంకరింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ సందడి చేస్తుంది. అప్పుడప్పుడూ తన హాట్ హాట్ అందాలతో అలరిస్తూ యువతరం మనసులు కొల్లగొడుతుంది.

చూడటానికి బొద్దుగా, ముద్దుగా కనిపించే శ్రీముఖి ఓ స్టార్ హీరోకు గాలం వేసిందని, లవ్‌లో పడిందని, డేటింగ్ చేస్తోందని రకరకాల వార్తలు ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమె వెంటనే స్పందించకపోవడంతో చాలామంది నిజమే అనుకున్నారు కూడా. ఆ తర్వాత పెళ్లికి సంబంధించి పుకార్లు తప్ప అప్‌డేట్స్ రాకపోవడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు శ్రీముఖికి ఏదో లోపం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవడం లేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఈ బ్యూటీ తనలో ఏ లోపం లేదంటూ స్పందించినప్పటికీ అదేదీ పట్టించుకోకుండా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా నీతోనే డ్యాన్స్ 2.0 షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శ్రీముఖి తాజాగా చిలుకపచ్చ డ్రెస్‌ వేసుకొని అందాల బొమ్మలా ముస్తాబై, ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయగా.. పెళ్లికి రెడీ అవుతున్నట్లున్నావంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఫార్టీ ప్లస్ దాటింది ఇంకెప్పుడు పెళ్లి? అంటూ ముఖం మీదే అడిగేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ‘గ్రీన్ యాపిల్ పండులా ఉన్నావు.. నువ్వే నా క్రష్’ అంటూ కామెంట్ చేయగా, పలువురు గార్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed