న‌డుము తిప్పుతూ మెలిక‌లు తిరుగుతూ ఆ పని చేస్తున్న స‌మంత.. ఆఫర్లు లేకపోవడం వల్లే అంటున్న నెటిజన్లు

by Kavitha |
న‌డుము తిప్పుతూ మెలిక‌లు తిరుగుతూ ఆ పని చేస్తున్న స‌మంత.. ఆఫర్లు లేకపోవడం వల్లే అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది. కాగా ఆ మధ్య మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే అనారోగ్య సమస్యలతో గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు సినిమాల, సిరీస్‌ల విషయంలో చాలా సెలెక్టీవ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే సమంత ఇతరులు హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలియజేస్తూ బాత్ టబ్ థెరపీ గురించి వివరించినది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మన అందరికీ తెలిసిందే. అయితే వాటిని కంటిన్యూ చేస్తునే తాజాగా ఈమె తన వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో నడుమును ఒక తీగలాగా ఎటుపడితే అటు తిప్పుతూ తను మెలికలు తిరుగుతూ వ్యాయామం చేసింది. అదేవిధంగా నాకు ఇష్టమైన వర్కౌట్స్‌లో ఫ్లోర్ మూమెంట్ ఒకటి. ఇది చేస్తూ వేరే వాళ్ళకి నేర్పియడం అంటే ఇంకా ఇష్టం అంటూ క్యాప్షన్ జోడించింది. ఆ ఆసనాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. అదే విధంగా సినిమా ఆఫర్లు లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ఆసనాలు చేస్తు ప్రేక్షకులకు దగ్గరవుతుందని మరికొంత మంది అంటున్నారు. మరి మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story

Most Viewed