- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi: చిరంజీవిని పచ్చి బూతులు తిడుతోన్న నెటిజన్.. నెట్టింట దుమారం రేపుతోన్న వీడియోలు?
దిశ, సినిమా: సాధారణంగా ఎవరైనా సరే అభిమాన హీరో, హీరోయిన్ కనిపిస్తే వెంటనే తమతో ఫొటోలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఎలాంటి స్టేటస్ చూపించుకోకుండా దగ్గరికొచ్చి మరీ సెల్ఫీ ఇస్తారు. మరికొంతమంది తమను దేవుడిలా కొలిచే ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలా అభిమానుల్ని పట్టించుకోకుండా తోసేసిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో అనేకం చూస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చింరంజీవి కూడా సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లింకారతో కలిసి చిరంజీవి ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లిన వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. వారం పాటు పారిస్‌లో గడిపిన చిరు ఫ్యామిలీ తాజాగా తిరిగి హైదరాబాదుకు వచ్చారు.
ఇక మెగాస్టార్ ఎయిర్ పోర్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇండగో సిబ్బంది చిరంజీవితో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. కానీ ఈ హీరో వారిని పట్టించుకోలేదు. చిరంజీవి ఆ వ్యక్తిని పక్కకు తోసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెగాస్టార్‌పై పలువురు జనాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఒక్క నిమిషం ఆగి సెల్ఫీ ఇవ్వడానికి ఏమవుతుంది? ఫ్యాన్స్ వల్లనే నువ్వు మెగాస్టార్ అయ్యావని మర్చిపోయావా? ఆ వ్యక్తిని తోయ్యకుండా నోటితో చెప్తే మర్యాదగా ఉంటుంది కదా? అని వాదిస్తున్నారు. కొంతమందైతే మెగాస్టార్‌ను పచ్చి బూతులు కూడా తిడుతున్నారు. మరికొంతమంది చిరుకు సపోర్ట్ చేస్తూ జర్నీ వల్ల అలసిపోయారేమో అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.