- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసిందిగా.. లావణ్య త్రిపాఠి చేసిన పనికి చిరంజీవి సతీమణి రియాక్షన్ ఇదే!
దిశ, సినిమా : మెగా కోడలు, హీరో వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌నే శాసిస్తున్న ఫ్యామిలీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ బ్యూటీ స్టేటల్ మరింత పెరిగిపోయిందని చెప్తుంటారు. కాగా ఇటీవల ఈ అమ్మడు చేసిన పనితో మెగా ఫ్యామిలీ విమర్శలు ఎదుర్కొంటున్నది. చివరికి చిరంజీవి సతీమణి సురేఖ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి అభిమానులైతే మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసిందిగా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటో అనుకుంటున్నారా?
హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొద్ది రోజుల క్రితం తన అత్తగారు, చిరంజీవి సతీమణి అయిన సురేఖతో ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయించింది. ఈ పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేశారు. అయితే బిజినెస్ బాగా నడవాలంటే ముందుగా దాని గురించి జనాలకు తెలియాలి. అందుకోసం ప్రచారం చేయాలి. ఇదులో భాగంగా అత్తమ్మాస్ కిచెన్ సంస్థకు అడ్వైర్టైజ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో లావణ్య త్రిపాఠి, అత్తయ్యతో కలిసి ఆవకాయ పచ్చడి తయారు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు.
అయితే ఆవకాయ పచ్చడి పెడుతున్న లావణ్య త్రిపాఠితోపాటు అక్కడ ఎవరూ చేతులకు గ్లౌజులు ధరించలేదు. హెయిర్ పడకుండా తలకు క్యాప్స్ కూడా పెట్టుకోలేదు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ అంతా నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఎలాంటి పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా పచ్చడి పెడుతున్నారని మండిపడుతున్నారు. పైగా మెగా కోడలికి ఆ మాత్రం తెలియదా? అంటూ విమర్శిస్తున్నారు. దీంతో చివరికి మెగాస్టార్ భార్య సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘అది ఇంట్లో అవసరాలకు చేసిన ఆవకాయ్ పచ్చడి. కష్టమర్స్ కోసం కాదు. మేము కస్టమర్లకు రుచి, శుచితో కూడిన ఫుడ్ ఇచ్చేందుకు ప్రమాణాలు పాటిస్తున్నాం’’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.